పింఛన్లకు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

పింఛన్లకు లైన్‌ క్లియర్‌

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

ప్రస్తుత పింఛన్ల వివరాలు..

జిల్లాలో 8,038 మంది దరఖాస్తు

భూపాలపల్లి రూరల్‌: ప్రభుత్వం కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించడంతో అర్హులైనవారు హర్షం వ్యక్తం చేశారు. ఈక్రమంలో జిల్లాలో సుమారు 8,038మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తిచేసి.. మంజూరు ప్రక్రియ వైపు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

431 దరఖాస్తుల తిరస్కరణ..

చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు జిల్లాలో 8,038 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,466 మంది అర్హులు కాగా, 431 మంది దరఖాస్తులను అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. వెరిఫికేషన్‌ సమయంలో 121 మంది దరఖాస్తుల్లో సరైన పత్రాలు లేకపోవడంతో ఫైనల్‌ చేయలేదు. 20 మందివి పెండింగ్‌లో ఉంచారు. అనంతరం ఎంపీడీఓల వద్దకి దరఖాస్తులు రాగా.. 7,342 అప్రూవల్‌ కాగా, 31 రిజక్టు అయ్యాయి. 30 పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 53,561 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వారికి ప్రతీ నెల రూ.12,74,18016 ప్రభుత్వం అందిస్తుండగా.. కొత్త పింఛన్ల మంజూరుతో లబ్ధిదారులతోపాటు పంపిణీ చేసే నగదు మొత్తం పెరగనుంది.

ప్రత్యేక సమావేశాలు..

నేడు (గురువారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నూతన లబ్ధిదారులకు అధికారిక ప్రోసిడింగ్‌ పత్రాలను అందజేయనున్నారు. వీరికి వచ్చే నెల నుంచి పింఛన్‌ సొమ్ము అందజేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

దరఖాస్తులు వచ్చినవి 8,038

అర్హత పొందినవి 7,466

అనర్హులుగా గుర్తించినవి 431

హోల్డ్‌లో ఉన్నవి 121

పెండిండ్‌లో ఉన్నవి 20

కొత్త పింఛన్‌ దరఖాస్తులు ఇలా..

పూర్తయిన పరిశీలన

తిరస్కరణకు గురైనవి 431

నేటి నుంచి ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీ

వచ్చే నెలనుంచి ఖాతాల్లోకి

పింఛన్‌ సొమ్ము

కేటగిరీ లబ్ధిదారుల సంఖ్య

వృద్ధాప్యం 22,399

వితంతు 21,034

దివ్యాంగులు 6,380

గీత, చేనేత కార్మికులు 1,541

ఒంటరి మహిళలు 1,191

బీడీ కార్మికులు 47

ఫైలేరియా 66

డయాలసిస్‌ 58

చేనేత 845

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement