మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరచడంతో పాటు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌, వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీ–సెక్షన్‌ (సిజేరియన్‌) ప్రసవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సిజేరియన్‌ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జీజీహెచ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ రాజేష్‌, పీఓ ఎంసీహెచ్‌ డాక్టర్‌ శ్రీదేవి, పీఓ ఎన్‌సీడీ డాక్టర్‌ దేవేందర్‌, పీఓ ఎన్‌టీఈపీ డాక్టర్‌ సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement