అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

మహాముత్తారం: ఆజంనగర్‌ రేంజ్‌ పరిధిలో అక్రమ పోడు సాగుపై శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఏడాది సాగు.. ఆపై విక్రయం’ కథనానికి అధికారులు స్పందించారు. ఆజంనగర్‌ రేంజ్‌ అధికారులు శుక్రవారం మండలంలోని నిమ్మగూడెం, యామన్‌పల్లి, కోనంపేట, మహబూబ్‌పల్లి గ్రామాల్లో అటవీశాఖ వాహనంతో మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహించారు. రిజర్వ్‌ పారెస్టు భూముల్లో చెట్లు నరికి పోడుచేసి క్రయవిక్రయాలు కొనసాగిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూములను రియల్‌ఎస్టేట్‌లా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రయవిక్రయాలు కొనసాగించినా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. అటవీ భూములను అమ్మే, కొనుగోలు చేసేవారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

ఆజాంనగర్‌ గ్రామంలో ప్రచారం..

భూపాలపల్లి రూరల్‌: అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని ఆజాంనగర్‌ ఇన్‌చార్జ్‌ రేంజ్‌ అధికారి కోటేష్‌ అన్నారు. శుక్రవారం ఫారెస్టు అధికారులు ఆజాంనగర్‌ గ్రామంలో మైక్‌ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కోటేష్‌ మాట్లాడుతూ అడవులను పోడుచేస్తే కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాంనగర్‌ రేంజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో మైక్‌ ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement