ఖిలా వరంగల్: వరంగల్చౌరస్తా మేదరివాడలో వెదురు బతుకమ్మ బుట్టలు తయారవుతున్నాయి. ఈ బుట్టలకు కావాల్సిన ముడిసరుకును నెల ముందుగానే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఖమ్మం, భద్రాచలం నుంచి తెచ్చకుంటారు. 50 కుటుంబాలు ఈ వెదురు బతుకమ్మలు తయారుచేసి ఉపాధి పొందుతున్నాయి. బుట్టల సైజ్ను బట్టి రూ.50 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పూలు దొరికే పరిస్థితి లేకపోవడంతో, అధికంగా ఖర్చు లేకుండా తక్కువ పూలతో పెద్ద బతుకమ్మలను ఆకర్షణీయంగా వెదురు బుట్టలను వాడి తయారు చేస్తున్నారు నగరవాసులు. చేతివృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో తమకు బతుకమ్మ పండుగ కారణంగా ఉపాధి దొరుకుతోందని ఆ కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
●


