సద్దులకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సద్దులకు సిద్ధం

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

– IIలోu

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

భూపాలపల్లి పట్టణంలో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు

భూపాలపల్లి అర్బన్‌: బతుకమ్మ సంబరాల్లో చివరిదైన సద్దుల బతుకమ్మను నేడు (ఆదివారం) నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ జరుపుకునే ప్రాంగణాలు, ఆలయ ప్రాంగణాలు ముస్తాబు చేశారు. భూపాలపల్లి మున్సిపల్‌ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంగణాలు సిద్ధం చేశారు. జలాశయాల వద్ద, దేవాలయాల్లో, పలు కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మలను నీటిలో వదిలే సమయంలో ఇబ్బందులు చోటు చేసుకోకుండా బృందాలను జలాశయాల వద్ద ఉంచనున్నారు. పోలీస్‌ యంత్రాగం ఇప్పటికే బందోబస్తుపై దృష్టి సారించింది. ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

సద్దుల బతుకమ్మ కోసం అందంగా బతుకమ్మలు పేర్చేందుకు ఆడపడుచులు పూల సేకరణలో నిమగ్నమయ్యారు. శనివారం గ్రామాల నుంచి కొందరు తంగేడు, గునుగు, టేకు, బంతి పూలను జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోకి తీసుకువచ్చి విక్రయించారు. తంగేడు పూల కట సైజును బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయించారు. గునుగు పూల కట్టలను రూ.20నుంచి రూ.30వరకు, బంతి పూలను ప్రాంతాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించారు.

ముస్తాబవుతున్న

బతుకమ్మ ప్రాంగణాలు

మున్సిపాలిటీ పరిధిలో

ప్రత్యేక ఏర్పాట్లు

పూలకు భలే గిరాకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement