భిక్షాటన చేస్తూ నిరసన | - | Sakshi
Sakshi News home page

భిక్షాటన చేస్తూ నిరసన

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. కలెక్టరేట్‌ ఎదుట చేపడుతున్న సమ్మెలో భాగంగా ఉద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సమ్మె కారణంగా జిల్లాలోని పలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, కార్యదర్శి మధుబాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రఘురాం, కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ జగదీశ్‌, సలహాదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement