నా భవిష్యత్‌ను నిర్మించారు | - | Sakshi
Sakshi News home page

నా భవిష్యత్‌ను నిర్మించారు

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

నా భవిష్యత్‌ను నిర్మించారు

మహబూబాబాద్‌ రూరల్‌ : ఈ కుమార్తెల దినోత్సవం సందర్భంగా నా జీవితంలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులైన నా తల్లిదండ్రులు భూక్యా భీమా, మంజుల గురించి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు పాఠశాల విద్యను అభ్యసించే అవకాశం లభించలేదు. అయినప్పటికీ, కష్టపడి పనిచేస్తూ నా భవిష్యత్‌ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి ప్రోత్సాహం, త్యాగాల వల్లనే నేను హైదరాబాద్‌లోని సీబీఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) పూర్తి చేయగలిగా. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో నాలుగేళ్ల పాటు బిజినెస్‌ అనలిస్టుగా పనిచేశాను. నా తల్లిదండ్రుల పూర్తి మద్దతుతో కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి సివిల్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు వేశాను. చివరకు విజయం సాధించి 2017 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిగా సేవలో చేరాను. మా కుటుంబంలో మొదటి తరం అధికారిగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ రోజు కుమార్తెలను గౌరవించే రోజు. కానీ నా విజయానికి సంబంధించిన ప్రతీ గౌరవం నా తల్లిదండ్రులకే చెందుతుంది. – భూక్య లావణ్య, మానుకోట జిల్లా అటవీశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement