వయోవృద్ధుల భద్రత, రక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధుల భద్రత, రక్షణకు చర్యలు

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

భూపాలపల్లి రూరల్‌: వయోవృద్ధుల భద్రత, రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌, సంక్షేమ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ అర్జున్‌, డే కేర్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌ కొలగూరి సంజీవరావు, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement