మొగుళ్లపల్లి: మండలంలోని ఆకినపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వేను ఆర్డీఓ హరికృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు రీ సర్వే ప్రాముఖ్యతను వివరిస్తూ, సర్వేలో ఏవైనా తేడాలు వస్తే రైతులు గ్రామసభలో తమ అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. భూ రీ సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, మండల సర్వేయర్, జీపీఓ, సర్వేయర్లు, ఆకినపల్లి రైతులు పాల్గొన్నారు.


