కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం నాగేంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
రామప్పలో
అమెరికా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు.
నాటక ప్రదర్శన
పోస్టర్ ఆవిష్కరణ
కాజీపేట రూరల్: సురభి నాటకాలను బతికించాలని కాజీపేట రైల్వే సీనియర్ డీఈఈ, రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ జి.సూర్యనారాయణ అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కళావేదికపై ఆదివారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన పోస్టర్‌ను సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను బతికించాలని జానపద కళలు, ఆధ్యాత్మికత, మన దేశ రాజుల రాజ్యాల వీరగాథలను తెలిపేందుకు సురభి నాటక ప్రదర్శనకు సహకరిస్తున్న రైల్వే ఇన్‌స్టిట్యూట్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న కాజీపేట రైల్వే కమ్యూనిటిహాల్‌లో సాయంత్రం 5 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనకు రైల్వే ఉద్యోగులు, కాజీపేట ప్రాంత ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి నాటకాన్ని తిలకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సురభి నాటక సంస్థ అధ్యక్షుడు సింధురి కొండల్‌రావు, ట్రెజరర్ కార్తీక్, కార్యదర్శి సురభి సంతోశ్, సభ్యులు నాగరాజు, ఇన్‌స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ మెరుగు రాజయ్య, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, సంస్కృత విభాగం ఇన్‌చార్జ్ ధారవత్ రఘు, సభ్యులు పి.రవికిరణ్ పాల్గొన్నారు.
జనగణనలో
బీసీల లెక్కలు చేపట్టాలి
కేయూ క్యాంపస్: కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి లెక్కలు చేపట్టాలని బీసీ కుల గణన సాధన సమితి కన్వీనర్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమనోహర్ డిమాండ్ చేశారు. ఆదివారం కేయూలోని దూరవిద్యాకేంద్రంలో శ్రీజనగణనలో ఓబీసీల కాలమ్ ఏర్పాటుశ్రీ అంశంపై బీసీ సంఘాలతో, ముఖ్యులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులగణన సాధన సమితి కన్వీనర్ మురళిమనోహర్ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోయే జనగణనలో బీసీల జనగణన చేపట్టకపోతే భవిష్యత్‌లో బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విపరీతంగా నష్టపోతారన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్, విద్యాసంస్థల్లో సీట్లు, రాజకీయ ప్రాతినిథ్యం దక్కాలంటే కచ్చితమైన లెక్కలు ఉండాలన్నారు. అదే డిమాండ్‌తో ఈనెల 11న హనుమకొండలోని ఏకశిల పార్కువద్ద ప్రత్యేకంగా నిరసన దీక్షలను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈదీక్షలకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు, వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, తాడిశెట్టి క్రాంతికుమార్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, సాయిని నరేందర్, గొల్లపెల్లి వీరస్వామి పాల్గొన్నారు.
గంగారం రేంజ్
అఽధికారిగా మయూరి
గంగారం : గంగారం రేంజ్ అటవీశాఖ అధికారిగా మయూరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, సిబ్బంది మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.


