● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను కేవలం భవనంగా కాకుండా వయోవృద్ధులకు నిజ మైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వమోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో ఏ ర్పాటు చేసిన ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆది వారం ప్రారంభించారు. అనంతరం సెంటర్‌లోని సదుపాయాలను పరిశీలించి వృద్ధులతో ముచ్చటించారు. వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమ సమయాన్ని ఆనందంగా గడిపేలా ఆరోగ్యం, వినోదం, పరస్పర స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వృద్ధాప్యంలో వారికి ఆరోగ్య సంరక్షణతోపాటు ఆప్యాయత, భద్రత, గౌరవం, మానసిక ప్రశాంతత అవసరమని అన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మ న్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీని వాస్, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, రెడ్ క్రాస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి
పునర్జీవం తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో తెలుగు సాహిత్యానికి పునర్జీవం తీసుకువాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం లక్ష్మయ్య రచించిన ఉషోదయ సుభాషిత శతకం పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఆదివారం నిర్వహించారు. మందల రవీందర్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ పెంచుతూ సాహిత్యంపై ముందుకు తీసుకెళ్లాలని సూ చించారు. మారుతున్న పరిస్థితులతో తెలుగు సాహిత్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్తమాన కవులు, రచయితలకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. సాహిత్యం, సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న లక్ష్మయ్యను అభినందించారు. జిల్లాలో సమావేశం నిర్వహించేందుకు సాహిత్య కళాభవనం ఏర్పాటు చేయాలని గడ్డం లక్ష్మయ్య కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, రవి, భాస్కర్, నాగరాజుశర్మ, అబ్దుల్లా, శ్రీరామ్, శంకరయ్య, సాగర్, నాగరాజు, సురేష్, రాజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


