హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

మంగపేట మండలంలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదివారం ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివా రం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి నుంచి భక్తులు వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

– మంగపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement