● కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
కాళేశ్వరం(కాటారం): యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్‌లో జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనగామ కరుణాకర్ రావు, జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వివిధ వయస్సు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే పిల్లలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడే సాధనమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, యోగాపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా స్థాయి యోగాసన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి సర్పంచ్ పంతకాని సడవలి, ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమలసమ్మయ్య, సీడీపీఓ రాధిక, ఎస్సై శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ సెక్రెటరీ ఆత్మకూరి కుమార్‌యాదవ్, జనరల్ సెక్రెటరీ బుడిమే కుమార్, యోగా గురూజీలు వావిళ్ల కిష్టయ్య, వావిళ్ల మహేందర్, ఎడ్ల మధు, ఎడ్ల రాము, గౌరోజు సదానందం, కుమార్ యాదవ్, శ్రీనివాస్, వనిత, గోపాల్, మీనా, శ్రీలత రెడ్డి, డాక్టర్ రఫీ, రాజబాపు, నాగరాజు పాల్గొన్నారు.


