భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
భక్తిశ్రద్ధలతో
హేమాచలుడికి పూజలు
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్‌కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్‌చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.


