భూపాలపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, మున్సిపల్, వైద్య తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, డిస్ట్రిక్ట్ హైవే టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అతివేగం, ఓవర్‌లోడింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై అనధికార పార్కింగ్‌ను నియంత్రించి, అవసరమైన చోట ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా హైవేలపై పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 1033 హెల్ప్‌లైన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా హైవేల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సంపత్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ మనో హర్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, జాతీయ రహదారుల ఈఈ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఈ–డార్ డీఆర్‌ఎం లక్ష్మణ్‌తో పాటు పంచాయతీరాజ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
10 బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ రాహుల్ శర్మ


