వైఎస్సార్‌ సంక్షేమ పాలన చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సంక్షేమ పాలన చిరస్మరణీయం

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

భూపాలపల్లి రూరల్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్టు కరుణాకర్‌ మాట్లాడుతూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108, 104 అంబులెన్స్‌ సేవలు, మహిళలకు పావలావడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్సార్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్‌, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ భువన సుందర్‌, నాయకులు చల్లూరు సమ్మయ్య, అప్పం కిషన్‌, వెంకీ, మహేష్‌, యాదవ్‌, మాలతి, జంపన్న, శీను, సహదేవుడు, అశోక్‌, సురేశ్‌, చల్లా రేణుక, శారద, పుష్ప, హైమద్‌ హఫీస్‌, గురజాల రవి, పొన్నగంటి శీను, అప్పల శ్రీనివాస్‌, భాస్కర్‌నాయక్‌, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement