నిబద్ధతతో పనిచేస్తే మన్ననలు | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో పనిచేస్తే మన్ననలు

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి

భూపాలపల్లి అర్బన్‌: ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తించినప్పుడే సహచరులు, అధికారులు, ప్రజల మన్ననలు పొందగలరని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. పదవీ విరమణ పొందిన జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ సన్మాన కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యాశాఖలో 42 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన రాజేందర్‌ తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డీఈఓ లలిత, సీపీఓ క్రిష్టయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ రఘు, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు రమేశ్‌, రాజగోపాల్‌, రామకృష్ణ, శైలజ, ఎంఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement