కాటారం సబ్‌ కలెక్టర్‌గా సౌరభ్‌శర్మ | - | Sakshi
Sakshi News home page

కాటారం సబ్‌ కలెక్టర్‌గా సౌరభ్‌శర్మ

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

మల్హర్‌(కాటారం): కాటారం సబ్‌ కలెక్టర్‌గా సౌరభ్‌ శర్మను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కాటారం ఆర్డీఓగా రవీందర్‌ విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కాటారం సబ్‌ కలెక్టర్‌గా సౌరభ్‌ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇన్‌చార్జ్‌ డీఈఓగా

బాధ్యతల స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారిగా ఎల్‌.లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న లలిత జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చారు. డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు.

యాదగిరి క్షేత్రంలో

భూపాలపల్లి ఎమ్మెల్యే పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారి సురేందర్‌రెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

రికార్డుస్థాయిలో

బొగ్గు ఉత్పత్తి

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు ఏఎమ్మార్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. గని ప్రారంభమైన నాటినుంచి ఉత్పత్తి, డిస్పాచ్‌, రిసిప్ట్స్‌లో ఇదే అత్యధిక పనితీరు అని పేర్కొన్నారు. ఆగస్ట్‌ నెలలో 2,94,362 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్‌ 2,97,768 మెట్రిక్‌ టన్నులు, 2,96,827 రిసిప్ట్స్‌ అయినట్లు చెప్పారు. ఆగస్టు 10న 15,024 మెట్రిక్‌ టన్నులు, 9న డిస్పాచ్‌ 12,577.6 మెట్రిక్‌ టన్నులు, ఆగస్టు 25న 12,087 రిసిప్ట్స్‌ అయినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌–2024లో 2,64,351 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి జరగగా, ఆగస్టులో గత రికార్డు దాటి అధిక ఉత్పత్తి సాధించినట్లు ఆయన వెల్లడించారు.

ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ

కాళేఽశ్వరం: ఆధునిక సాగు పద్ధతులపై మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం రైతువేదికలో మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాపురావు మహదేవపూర్‌ మండలంలో పంటల క్షేత్ర సందర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పద్ధతులతో పొందిన వ్యవసాయ అనుభవాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగుపరుచుకోవడమే ఈ శిక్షణ ఉద్దేశమని తెలిపారు. వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్‌, మండల వ్యవసాయ అధికారిణి శ్రీజ, ఉద్యానవన అధికారి మణి, కాళేశ్వరం, మెట్‌పల్లి సర్పంచ్‌లు వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాంబాబు, ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

7న ఐటీడీఏ ముట్టడి

పలిమెల: ఆదివాసీల హక్కులను కాపాడుకోవడం కోసం ఈనెల 7న నిర్వహిస్తున్న ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడికి జిల్లాలోని ఆదివాసీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడె కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మట్టి కిషోర్‌ ఆధ్వర్యంలో కరపత్రం, పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి పెద్ది శేఖర్‌, కార్యదర్శులు తోలెం భిక్షపతి, మట్టి ప్రసాద్‌, సలహాదారులు పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement