అర్హులందరికీ స్మార్ట్‌ రేషన్‌కార్డులు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ స్మార్ట్‌ రేషన్‌కార్డులు

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

గణపురం: అర్హులందరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించి నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని బుద్దారంలో స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ స్మార్ట్‌ కార్డులను ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం మండలంలోని ధర్మరావుపేటలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

నారాయణరెడ్డికి అవార్డు

టేకుమట్ల: సమాజ సేవకు గానూ రాష్ట్ర సేవా పురస్కార్‌ జాతీయ అవార్డుకు మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు పింగిళి నారాయణరెడ్డి ఎంపికయ్యారు. ఏసియా ఇంటర్‌నేషనల్‌ కల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌ స్ఫూర్తి అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ ఆకుల రమేశ్‌ అవార్డును అందించారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు, విద్యుత్‌ సదుపాయాల కల్పన, తాగునీటి కల్పన, అవినీతిపై తిరగబడి ప్రజలకు న్యాయం అందేలా కృషి చే సినందుకు అవార్డు అందించినట్లు తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారిగా లలిత

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారిగా లలితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఏడీ రాజేందర్‌ ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న లలితకు డిప్యూటేషన్‌పై పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేడు(మంగళవారం) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఆదిముక్తీశ్వరుడి చెంతకు ఉసిరి చెట్టు

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో పడమర దిక్కున కొన్నేళ్లుగా ఉన్నటువంటి ఉసిరి చెట్టును అడవిలోని ఽశ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద నాటారు. కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా పాత ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన విషయం విదితమే. తవ్వకాల మధ్యలో ఉసిరి చెట్టు ఉంది. హాని జరుగకుండా చెట్టు వేర్ల కింది నుంచి చుట్టూర తవ్వి తీశారు. అక్కడ తవ్వి తీసిన చెట్టును ఆదిముక్తీశ్వరాలయం వద్ద నాటారు. పర్యావరణ ప్రేమికులు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement