చారిత్రక రామప్ప ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం దేవాలయాన్ని జర్మనీ దేశస్తులు కేబ్లిజ్ యంగ్, యులిస్టేయింబ్, చీకో స్టాన్‌లు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అలాగే రామప్ప దేవాలయాన్ని ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు. వారి వెంట ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
– వెంకటాపురం(ఎం)


