హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని సహజ సిద్ధంగా వచ్చే చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్‌కుమార్‌ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిశేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. మూడు గంటల పాటు వేచి ఉండి భక్తులు స్వామివారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతలను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం వచ్చిన దంపతులు స్వామివారి నాభి చందన ప్రసాదాన్ని స్వీకరించారు. – మంగపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement