కళాకారుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

కళాకారుల పాత్ర కీలకం

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్‌: జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కళాకారుల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గుర్తింపు జానపద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందజేస్తున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో కళాకారులు ఆదివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కార్డులు అందజేయడం ద్వారా సంక్షేమ పథకాలు చేరువవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుతోజ్‌ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement