రాతి స్తంభాలు వెలుగులోకి.. | - | Sakshi
Sakshi News home page

రాతి స్తంభాలు వెలుగులోకి..

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

‘కాళేశ్వరం’ పనుల్లో

కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా పునర్నిర్మాణ పనుల్లో పాత ఆలయాల కూల్చివేతలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శని వారం ఈఓ మహేశ్‌, క్షేత్ర కన్సల్టెన్సీ అసిస్టెంట్‌ స్థ పతి గణేషన్‌, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌బీశాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో గర్భగుడిని వారం క్రితం తొలగించగా మిగతా నాలుగు స్తంభాలను ప్రొక్‌లైయినర్‌తో ద్విలింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా తీశా రు. ద్విలింగాలు( జోడులింగాలు) ఇప్పటికే ఇనుప కంచెలాగా ఓ బాక్స్‌ చేసి పదిలంగా అమర్చారు.

రాతి స్తంభాలు వెలుగులోకి..

గర్భగుడికి ఆనుకుని ఉన్న నాలుగు రాతి స్తంభాలు కాకతీయుల కాలం నాటివని తెలిసింది. ఆ రాతి స్తంభాలకు 1978–82 మధ్య కాలంలో జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్‌తో ప్లాస్టింగ్‌ చేసి గర్భగుడిని పైనుంచి నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఆ రాతి స్తంభాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పురాతన రాతి నిర్మాణాలు బయటపడడంతో ఆలయ చరిత్రపై ఆసక్తి నెలకొంది. దేవస్థాన అధికారులు స్తంభాలపై సిమెంట్‌ తొలగింపు పనులు ముమ్మరం చేసి ఆరా తీస్తున్నారు. ఎలాంటి శాసనాలైనా ఉన్నాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. కాగా, ఇప్పటికే శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం కింద కూడా రాళ్లు బయటపడిన విషయం విధితమే.

21.5 ఫీట్ల పొడవు,

వెడల్పుతో

గర్భగుడి నిర్మాణం..

గర్భగుడి పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ, కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీశాఖ, క్షేత్ర కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో మార్కింగ్‌ ఇచ్చి పునాది తవ్వకాల పనులు ప్రారంభించారు. మట్టిని 12 ఫీట్ల మేర తీస్తున్నారు. 21.5 ఫీట్ల పొడవు, 21.5 ఫీట్ల వెడల్పుతో గర్భాలయ నిర్మాణం జరగనుందని తెలిసింది. అదేవిధంగా విజయ గణపతి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కాంక్రీట్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆలోచన దిశగా వచ్చే గోదావరి నది పుష్కరాల వరకు పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.

ప్రధాన గర్భగుడికి మార్కింగ్‌ చేసి పునాది తవ్వకాలు

విజయగణపతి ఆలయానికి

కాంక్రీట్‌ పనులు

21.5 ఫీట్ల పొడవు,

వెడల్పుతో గర్భాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement