ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారంభూపాలపల్లి ఏరియాలో ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ ప్రతినిధులతో స్టక్చ్రర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ ప్రతినిధులు ఉద్యోగుల సంక్షేమం, గనుల భద్రత, పని పరిస్థితుల మెరుగుదల, మౌలిక వసతులు, వైద్య సేవలు తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలు, సూచనలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. యూనియన్‌ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై సంబంధిత విభాగాల అధికారులు స్పందిస్తూ పరిష్కరించగల అంశాలపై తక్షణ చర్యలు చేపడతామన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ఐఎన్‌టీయూసీ ప్రతినిధులు ప్రస్తావించిన ప్రతీ సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏరియా అధికారులు శ్యామ్‌సుందర్‌, డాక్టర్‌ పద్మజ, రవికుమార్‌, జ్యోతి, ములుకుంట్ల తిరుపతి, శ్యామ్‌సుందర్‌, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుకర్‌రెడ్డి, స్టక్చ్రర్‌ కమిటీ సభ్యులు హుస్సేన్‌, బొడ్డు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మహాముత్తారం: ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భూపాలపల్లి సీసీఎస్‌, మహాముత్తారం పోలీ సులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో కాటారం గ్రామానికి చెందిన దానం శివకృష్ణ పట్టుపడ్డాడు. ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా శివకృష్ణను అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో శివకృష్ణను అదుపులోకి తీసుకుని రూ.70వేల వి లువైన 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చే సుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్‌ తెలి పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.

రామప్పలో సౌత్‌ జోన్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం

వెంకటాపురం(ఎం): మండలపరిధిలోని చా రిత్రక రామప్ప దేవాలయాన్ని సౌత్‌జోన్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈఓ ఉమ్మడి భాస్కర్‌ వారిని శాలువాలతో సత్కరించారు. రామప్ప శిల్పకళ సంపద గురించి టూరిజం గైడ్‌ తాడబోయిన వెంకటేశ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement