● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించేందుకు పోలీసు, ఎకై ్సజ్ అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జె.జీవన్‌కుమార్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, ఇతర సివిల్, తదితర కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కువ కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరి ష్కారమవడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ జూని యర్ సివిల్ జడ్జి జి.అఖిల, అడిషనల్ ఎస్పీ ఏ. నరేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులా పురం శ్రీనివాస్, డిస్టిక్ర్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


