అంగన్‌వాడీలకు విద్యుత్‌ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు విద్యుత్‌ వెలుగులు

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

భూపాలపల్లి రూరల్‌: చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందని భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ భిక్షపతి శనివారం ప్రకటనలో తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని మొత్తం 644 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. ప్రీస్కూల్‌ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు విద్యుత్‌ సౌకర్యం ఎంతో దోహదపడుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం విద్యుత్‌ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు.

జిల్లాలో 644 కేంద్రాలకు

విద్యుత్‌ కనెక్షన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement