స్నేహబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీక రాఖీ: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

స్నేహబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీక రాఖీ: కలెక్టర్‌

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

భూపాలపల్లి: రాఖీ పండుగ స్నేహబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీకకు నిలస్తుందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, కలెక్టరేట్‌ మహిళా సిబ్బంది కలెక్టర్‌ రాహుల్‌ శర్మకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ విధుల నిర్వహణలో కలెక్టర్‌ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ సీనియర్‌ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్‌ సహాయకులు మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement