అక్క మృతిని తట్టుకోలేక తమ్ముడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అక్క మృతిని తట్టుకోలేక తమ్ముడి ఆత్మహత్య

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

మహాముత్తారం: అక్క మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన తమ్ముడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ) లో చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. స్తంభంపల్లి(పీపీ) గ్రామానికి చెందిన పసుల చిన్న మల్లయ్య (55)అక్క జంగిలి గట్టమ్మ పది రోజుల క్రితం మృతి చెందింది. అక్క మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన చిన్నమల్ల య్య ఈ నెల 26న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై రమేశ్‌ తెలిపారు.

స్తంభంపల్లి(పీపీ)లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement