● జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని విద్యావనరుల కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి లింగాల కుమారస్వామి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చంద్రమౌళి, సీఆర్‌పీలు రాములు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, మహేష్, కొమురెల్లి, రమేష్ పాల్గొన్నారు.


