భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


