దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

డీఆర్‌ఓ వసంతకుమారి

భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ వసంతకుమారి సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ.. ప్రజావాణి అప్టికేషన్లు పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులకు సూచించారు.

14న సైక్లింగ్‌ పోటీలు

ములుగు/ములుగు రూరల్‌: ఈ నెల 14న ములుగు జిల్లాకేంద్రంలో అస్మిత ఖేలో ఇండియా బాలికల సిటీ సైక్లింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు మెరిట్‌ సర్టిఫికెట్‌తో పాటు మెడల్స్‌ అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement