మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
7
కొండెక్కిన చేపల ధరలు
మృగశిర కార్తె నాడు చేపలు తినాలనే సాంప్రదాయాన్ని పాటించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉదయం నుంచే చెరువులు, చేపల మార్కెట్ వద్ద క్యూ కట్టారు. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన గణపురం మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువుతో పాటు, మండలంలోని పలు కుంటలు, చెరువుల నుంచి మండలకేంద్రానికి సోమవారం చేపలను తీసుకొచ్చి పెద్దఎత్తున విక్రయించారు. సాధారణంగా తెల్లచేపలు రవ్వులు, బొచ్చ కిలో రూ.200 ఉండగా.. సోమవారం కిలో రూ.300పైన విక్రయించారు. కొర్రమీను చేపలు సాధారణంగా రూ.300 ధర ఉంటే.. మృగశిర సందర్భంగా రూ.400 నుంచి 500 వరకు విక్రయించారు. – గణపురం


