ఐటీడీఏలో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో వినతుల స్వీకరణ

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో 27 మంది గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజన సహకార సంస్థ మహదేవ్‌పూర్‌లోని గ్యాస్‌ గోదాంలో డెలవరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారిని నియమించాలని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ డైరెక్టర్‌లు బుచ్చయ్య, పోచయ్య తెలిపారు. మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు 2008–09 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని, దానికి కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ములుగు గ్రామంలో సంధ్యారాణి ఎంబీఏ కంప్యూటర్‌ పూర్తి చేసి ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన గిరిజనులు రుణం కావాలని విన్నవించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్‌, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, పెసా కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement