భూపాలపల్లి: జిల్లా కేంద్రమైన భూపాలపల్లిని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నా కనీస సౌకర్యాలు కల్పించే నాథుడే కరువయ్యాడన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అటకెక్కాయని, కార్మికుల వారసులు ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీనాలీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు పోలీసులు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాలకే పరిమితం అయ్యాయన్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సెగ్గెం సిద్ధు, పిల్లలమర్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అధ్వానంగా జిల్లా ఆస్పత్రి
అటకెక్కిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


