భూపాలపల్లి: జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్‌బీ ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్‌ను కాటారం ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న జె.మహేష్‌ను కాటారం ఎస్సై 2గా, మహాముత్తారం ఎస్సై పి.మహేందర్‌కుమార్‌ను కొయ్యూరుకు, వీఆర్‌లో ఉన్న ఎ.కల్యాణ్‌ను కొయ్యూరు ఎస్సై 2, భూపాలపల్లి ఎస్సై 2 జి.రమేష్‌ను మహాముత్తారం ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న సాయి శశాంక్‌ను పలిమెల ఎస్‌హెచ్‌ఓ, భూపాలపల్లి ఎస్సై 1 మచ్చ సాంబమూర్తిని మహదేవపూర్ ఎస్‌హెచ్‌ఓగా, పలిమెల ఎస్సై జె.రమేష్‌ను మహదేవపూర్ ఎస్సై 2, మహదేవపూర్ ఎస్‌హెచ్‌ఓగా పని చేస్తున్న కె.పవన్‌కుమార్‌ను భూపాలపల్లి ఎస్సై 1, కొయ్యూరు ఎస్‌హెచ్‌ఓగా ఉన్న వి.నరేష్‌ను డీఎస్‌బీకి, వేకెన్నీ రిజర్వ్‌లో ఉన్న వి.రజన్‌కుమార్‌ను చిట్యాల ఎస్సై 2గా, ఆర్.అశోక్, ఎ.శ్రీనివాస్‌లను డీఎస్‌బీకి, ఈ.సురేష్‌ను డీసీఆర్‌బీ, చిట్యాల ఎస్సై 2గా పని చేస్తున్న ఎండీ షాఖాన్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు.
15 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ


