అంబర్‌, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అంబర్‌, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ నిషేధిత అంబర్‌, గుట్కా ప్యాకెట్లను సీసీఎస్‌ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లికి చెందిన యూసఫ్‌ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించి రూ. 1.92 లక్షల విలువైన అంబర్‌తో పాటు వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement