భానుడు భగ్గుమంటున్నా ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కూలీలకు కనీసం గుక్కెడు తాగునీరు, కాసేపు సేదదీరేందుకు టెంట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహాముత్తారం మండలంలోని మహాముత్తారం, పెగడపల్లి, బోర్లగూడెం గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. శనివారం పెగడపల్లి గోరుకల కుంటలో పూడికతీత పనులు చేపడుతున్న ఉపాధిహామీ కూలీలకు తాగునీరు, నీడకోసం టెంట్, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ కిట్టు సౌకర్యాలేవీ కల్పించలేదు. ఎండతీవ్రతను తట్టుకునేందుకు అక్కడే ఉన్న చెట్టునీడన కూలీలు సేదదీరారు. – మహాముత్తారం


