భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేటీకే ఓసీ 2 ప్రాజెక్ట్‌లో శనివారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్‌సుందర్, ఏరియా రక్షణాధికారి మాటూరి రవీందర్, ఆఫీషియేటింగ్ ఏరియా ఇంజనీర్ వాల్మీకి కృష్ణయ్య, మేనేజర్ బోయిన రామాకాంత్, సంక్షేమ అధికారి సాధన్, రక్షణ అధికారి శివకుమార్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


