కుర్చీలో సర్పంచ్‌.. క్షేత్రంలో కూలీ | - | Sakshi
Sakshi News home page

కుర్చీలో సర్పంచ్‌.. క్షేత్రంలో కూలీ

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

రాజకీయాల్లో చిన్న పదవి దక్కినా చాలు.. రంగులు మార్చే నాయకులు, కార్లలో తిరిగే ప్రజాప్రతినిధులు ఉన్న రోజులివి.. ఒక ఊరికి సర్పంచ్‌ అంటే ఆ గ్రామ పథమ పౌరురాలు. రూ.కోట్ల నిధులు, గ్రామాన్ని శాసించే అధికారం చేతిలో ఉంటాయి. కానీ ఇవేమీ మహాముత్తారం మండలం పెగడపల్లి సర్పంచ్‌ కొర్ర వినోదను మార్చలేదు. 2019 ఒకసారి, 2025లో మరోసారి రెండుసార్లు సర్పంచ్‌ అయినా బతుకుదెరువు కోసం మండు టెండలో ఉపాధి హామీ పనులకు కూలీలతో కలిసి వెళ్తోంది. సర్పంచ్‌ పదవి కేవలం ప్రజలకు సేవచేసే మార్గంగానే భావించిన ఆమె నిప్పులు కురుస్తున్న ఎర్రటి ఎండలో సైతం కుటుంబ జీవనం కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. – మహాముత్తారం

Advertisement
 
Advertisement
Advertisement