భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. నీట్ నిర్వహణ, ధాన్యం కొలుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ఆంశాలపై శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రత, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రశ్నపత్రాల సురక్షిత రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెల 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మహిళా సంఘాల సభకు జిల్లాల నుంచి మహిళలను సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా నుంచి వెళ్లే మహిళా సంఘాల సభ్యులకు రవాణా, తాగునీరు, ఆహారం, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


