రామప్ప ఆలయంలో ట్రెయినీ ఐఏఎస్‌లు | - | Sakshi
Sakshi News home page

రామప్ప ఆలయంలో ట్రెయినీ ఐఏఎస్‌లు

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ట్రెయినీ కలెక్టర్లు సాయి శివాని, సచిన్‌ బసవరాజ్‌, నీలటూరు శ్రీకాంత్‌ రెడ్డి, పోతరాజు హరిప్రసాద్‌, పారస్‌ కుమార్‌, పామూరి సురేశ్‌ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో వారిని ఈఓ ఇమ్మడి భాస్కర్‌ శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం అధికారి సూర్యకిరణ్‌, గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట తహసీల్దార్‌ గిరిబాబు, ఆర్‌ఐ రమేశ్‌, టూరిస్ట్‌ పోలీసులు, పురావస్తు శాఖ సిబ్బంది ఉన్నారు. రామప్ప ఆలయాన్ని జపాన్‌కు చెందిన నాకాలిబోర్‌, షిగా దంపతులు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement