లైసెన్సులు రద్దు చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

లైసెన్సులు రద్దు చేస్తాం..

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్‌ మందులు విక్రయించే ఫర్టిలైజర్‌ షాపుల లైసెన్సులు రద్దు చేస్తాం. పీడీ యాక్ట్‌లు నమోదు చేయిస్తాం. రైతులు రసీదులు లేకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవద్దు. లూజు విత్తనాల జోలికి పోవద్దు. పత్తిసాగులో బీటీ 2 విత్తనాలను మాత్రమే వాడండి.

– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం..

ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, నకిలీ ఎరువులు, పర్యావరణాన్ని దెబ్బతీసే గ్లైఫోసెట్‌ వంటి మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రెవెన్యూ, పోలీస్‌, వ్యవసాయశాఖల అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీంలను మండలానికి ఒకటి ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

– సిరిశెట్టి సంకీర్త్‌, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement