చదువుకు కొదవలేదు.. | - | Sakshi
Sakshi News home page

చదువుకు కొదవలేదు..

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026
రూపాయి ఖర్చులేదు..

సర్కారు బడి.. పిలుస్తోంది

ఈ రోజుల్లో చదువు అనగానే కార్పొరేట్‌ పాఠశాలల చుట్టూ తిరగడం, రూ.వేలల్లో ఫీజు కట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. ఫీజులు ఎక్కువగా ఉంటేనే చదువు బాగా వస్తుందనేది భ్రమ మాత్రమే. మన కళ్ల ముందు మన ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏ మాత్రమూ తీసిపోకుండా అన్నీ వసతులతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మన పిల్లలను మన ప్రభుత్వ బడిలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

– భూపాలపల్లి అర్బన్‌

అర్హత కలిగిన ఉపాధ్యాయులు

ప్రభుత్వ ఉపాధ్యాయులు కఠినమైన డీఎస్సీ, టెట్‌ పరీక్షలు రాసి అత్యుత్తమ నైపుణ్యంతో ఎంపికై న విద్యావంతులు. వీరు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని బోధించే అవకాశం ఉంటుంది. మారుతున్న బోధన, అభ్యాసన విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తరగతులను ప్రారంభించారు. ముందుగానే ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి 6 నుంచి 10వ తర గతి వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం సెక్షన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ఆధునిక వసతులు

డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, అత్యాధునిక సైన్స్‌ ప్రయోగశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశోధనల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. జాతీయ, సైన్స్‌ పరిశోధన అంశాలు ప్రదర్శించేందుకు ఇన్స్‌ఫైర్‌ అవార్డుల పథకంలో పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. ఇది కాకుండా పాఠశాల తరఫున వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు విద్యాశాఖ ప్రోత్సహిస్తోంది.

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం

పేద విద్యార్థులు రోజూ బడికి వచ్చేలా తీసుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే బాధ తప్పింది. ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారం అందించే అవకాశాలు ఉన్నాయి.

రెండు జతల యూనిఫాం..

1 నుంచి 8 వతరగతి విద్యార్థులకు యేటా రెండు జతల యూనిఫాంలను విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. పాఠశాల ఇంటికి మూడు కిలోమీటర్ల పైన దూరం ఉండి రవాణా సౌకర్యం లేకపోతే 6, 7, 8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.250 చొప్పున ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.

విశాలమైన క్రీడా మైదానాలు

ప్రైవేట్‌ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా పరికరాలు ఉండటంతో విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యం సాధిస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

సుశిక్షితులైన ఉపాధ్యాయులతో

విద్యాబోధన

విద్యార్థులకు అన్నీ ఉచితమే

మధ్యాహ్న భోజనం, యూనిఫాం,

విశాలమైన ఆటస్థలాలు

Advertisement
 
Advertisement
Advertisement