అధికారులు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు ఏర్పాట్లు చేయాలి

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

నేటి ప్రజాదర్బార్‌కు మంత్రి సీతక్క

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: నేడు(శనివారం) భూపాలపల్లి మండలంగుర్రంపేటలో జరుగనున్న ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. గుర్రంపేట గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) నిర్వహించనున్న ప్రజాదర్బార్‌ కార్యక్రమ ఏర్పాట్ల్లపై శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు, ఇతర అంశాలకు సంబంధించి మరొక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ములుగు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు వారి వారి సమస్యల దరఖాస్తులు లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫెరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన డీటీఓ..

జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా వెంకన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ సుందర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement