పారదర్శకంగా రవాణా ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా రవాణా ప్రక్రియ

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

మల్హర్‌(కాటారం): ధాన్యం రవాణా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ అశోకుమార్‌ అన్నారు. గురువారం కాటారంలోని ఏఎంసీ గోదాం, రుద్ర కాటన్‌ మిల్లు, మీనాక్షి జిన్నింగ్‌ మిల్లును అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం అన్‌ లోడింగ్‌ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుమతి సమయంలో ఆలస్యం జరగకుండా సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం, నిల్వలు చేపట్టాలన్నారు. గోదాంలలో సరైన వసతులు కల్పించడం, తగిన భద్రతా చర్యలు తీసుకోవడం, ధాన్యం నాణ్యతను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం రాములు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement