భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, రాజకీయ జోక్యాల కారణంగానే సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ అన్నారు. గురువారం కేటీకే–5 ఇంకై ్లన్‌లో పిట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మిక సమస్యల పరిష్కారం పేరుతో సమ్మెలు, చర్చలు జరిపిన గుర్తింపు సంఘాలు కార్మికులకు ప్రయోజనం చేకూర్చలేకపోయాయని విమర్శించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిర్వహణ, సొంత ఇంటి పథకం, పెర్కస్‌పై ఆదాయపు పన్ను రద్దు, మారుపేర్ల సవరణ, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, డిస్మిస్ కార్మికులకు అవకాశం, మైనింగ్, టెక్నికల్, క్లరికల్ సిబ్బంది సమస్యల పరిష్కారం వంటి అంశాలపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 30తో 11వ వేతన సవరణ గడువు ముగియనున్న నేపథ్యంలో జూలై 1 నుంచి అమలులోకి వచ్చే 12వ వేతన సవరణ కోసం జేబీసీసీఐ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని బీఎంఎస్ జాతీయ కోల్ సెక్టర్ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 7న భూపాలపల్లిలో జరిగే బీఎంఎస్ 29వ మహాసభలో 12వ వేతన సవరణ, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, కార్మిక సంక్షేమ అంశాలపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. మహాసభలను కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యతిపతి సారంగపాణి, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, ఓరం లక్ష్మణ్, కొత్తూరి మల్లేష్, కటకం శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, పునీత్ రావు, చిట్యాల ప్రవీణ్, రాజు నాయక్ పాల్గొన్నారు.
బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్


