మహాముత్తారం మండలంలో గురువారం అకాలవర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు నిలిచాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లబస్తాలు తడవడంతో రైతులు టార్పిన్ కవర్లు కప్పుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
మహాముత్తారం మండలం కోనంపేటలో ధాన్యం బస్తాలపై పరదాలు కప్పిన రైతులు
– మహాముత్తారం


