వీరన్న సన్నిధిలో పూజలు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో పూజలు

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

కురవి:మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని డైరెక్టర్‌ ప్రొటోకాల్‌ జీఏడీ శివలింగయ్య(ఐఏఎస్‌) దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారి పేర అర్చకులు గోత్రనామార్చనలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుఉన్నారు.. ముఖమండపంలో వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌, జీపీఓ జుంకీలాల్‌, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement