ఉపాధి కూలీలతో ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలతో ఆవిర్భావ వేడుకలు

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

భూపాలపల్లి రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ నిరంతరం శ్రమిస్తున్న కూలీల కష్టాన్ని అభినందిస్తూ, శ్రమజీవుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భూపాలపల్లికి చెందిన ఓ పండ్ల వ్యాపారి తనకు అభిమానంతో అందించిన కొబ్బరి బొండాన్ని మహిళా కూలీతో వచ్చిన చిన్నారికి తాగించారు. ఈ దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement