సంక్షేమం వైపు.. | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం వైపు..

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

– మరిన్ని ఫొటోలు 8లోu

సంక్షోభం నుంచి

భూపాలపల్లి: సంక్షోభంలో ఉ న్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీ సుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులుబాసిన మ హానీయుల స్ఫూర్తితో ముఖ్య మంత్రి రేవంతర్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథం వైపు సాగుతూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్ర ణాళికబద్ధమైన అభివృద్ధి సాధనకు విజన్‌ 2047తో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ యె న్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాలో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలి సి ఐడీఓసీ కార్యాలయానికి విచ్చేసిన విప్‌ శ్రీనివా స్‌రెడ్డికి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం..

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ధరణిని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెలంగాణ భూ భారతి చ ట్టం 2025ను తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,010 గ్రా మ పాలనాధికారులతో సహా 8,900 మంది సిబ్బందిని నియమించి, 5,520 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు రైతులకు సేవలను అందిస్తున్నారన్నారు.

వ్యవసాయ దిగుబడుల్లో మొదటి స్థానం..

వ్యవసాయశాఖ ద్వారా రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో వ్యవసాయ దిగుబడుల్లో రాష్ట్రం దేశంలో నే మొదటిస్థానంలో నిలవడం గర్వకారణం. జిల్లాలోని 29,683 మంది రైతులకు రూ. 299.35 కోట్లు రుణమాఫీ చేశామని, పంట పెట్టుబడికి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.12 వేల చొప్పున సహాయం అందిస్తున్నాం. యాసంగిలో ఇప్పటి వరకు 10,833 మంది రైతుల నుంచి 80 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రూ.79.30 లక్షలు చెల్లింపు చేశాం. అలాగే జిల్లాలో 1,38,747 రేషన్‌ కార్డులు ఉండగా, వాటిలో 3,93,919 మంది సభ్యులు నమోదై ఉన్నారు. వీరి కోసం ప్రతీ నెలా 2,530 టన్నులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా అందించనున్నామన్నారు.

విద్యా, వైద్యరంగాలకు భారీగా నిధులు..

విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల విద్యార్థులకు 40 శాతం డైట్‌ చార్జీలు, 200 శాతం కాస్మాటిక్‌ చార్జీలను పెంచింది. ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పోషకాలతో బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్న భోజన పథకం అమలు చేసున్నాం. ఈ సంవత్సరం 10వ తరగతిలో రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో జిల్లా నిలిచింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రూ. 9.6 కోట్లతో అదనపు అంతస్తు నిర్మాణం, రూ. 4 కో ట్లతో సీటీ స్కాన్‌ యంత్రం, రూ. 40 లక్షలతో వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

కాళేశ్వరం అభివృద్ధికి

రూ.200 కోట్లు..

కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. గత నెల మే 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నాం. రూ. 1.20 కోట్లతో నిర్మించిన మ్యూ జియంను మే 21న గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దంపతులు ప్రారంభించారు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న ప్ర జాప్రతినిధులు, అధికారులకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, ఎ మ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు..

సొంతిళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు అందజేస్తున్నాం. ప్రభుత్వం మొదటి విడతలో జిల్లాకు 4,434 ఇళ్లు మంజూరు చేయగా, 547 నిర్మా ణం పూర్తి కాగా 3,887 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 77.12 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement